Mar 18, 2025, 16:03 IST/
ఏపీలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం
Mar 18, 2025, 16:03 IST
AP: కృష్ణజిల్లాలో వీరపనేనిగూడెంలో దారుణ ఘటన జరిగింది. అక్కడ ఓ మైనర్ బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 9 న బాలిక ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తుండగా కొందరు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి 3 రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి చెర నుంచి బాధితురాలు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.