సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెంలో ఘనంగా గంగమ్మ జాతర

115பார்த்தது
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెంలో ఘనంగా గంగమ్మ జాతర
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెంలో యాదవ సంఘం వారు గంగమ్మ జాతర ను ఘనంగా నిర్వహించారు. జెర్రిపోతుల గూడెంలో గత ఆరు సంవత్సరాల నుండి గంగమ్మ జాతర ను నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురవాలని గంగమ్మను ప్రార్థిస్తున్నారు. యాదవ సంఘం వారు మాట్లాడుతూ మా గ్రామంలో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో గంగమ్మ జాతర జరుపుకుంటున్నాము అని వారు తెలిపారు. ఈ వేడుకలు గుడి చైర్మన్ మల్లయ్య యాదవ్, పెద్ద గొల్ల రాసి సైదులు, కాగడాల లక్ష్మయ్య,యాదవ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

டேக்ஸ் :