బిసి రుణ ధరఖాస్తులను సత్వరంగా పరిశీలించాలి - ఎంబీసీ అద్యక్షుడు వంటిపులి నాగరాజు

56பார்த்தது
బిసి రుణ ధరఖాస్తులను సత్వరంగా పరిశీలించాలి - ఎంబీసీ అద్యక్షుడు వంటిపులి నాగరాజు
కోదాడ : మండల పరిధిలో ఎంబీసీ కార్సోరేషన్‌కు వివిధ వృత్తుల వారు రుణాల కోసం పెట్టుకున్న ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా ఎంబీసీ అధ్యక్షుడు వంటిపులి నాగరాజు కోరారు. శుక్రవారం ఆయన కోదాడ ఎంపీడీవో ప్రేమ్‌కరణ్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి దరఖాస్తుల పరిశీలనపై పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ గ్రామాల వారికి ధరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చైయాలని ఆయన కోరారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తున్నందున తక్షణమే వాటిని పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆయన కోరారు. కాగా గ్రామ సభల షెడ్యూల్‌ను జిల్లా అధ్యక్షడికి ఎంపీడీవో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీపఈసీ నాయకులు గోవిందరావు, రాధకృష్ణ, శ్రీనివాసరావు, ఉపేందర్‌, పుల్లయ్య, నర్సింహారావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :