పులివెందుల: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన పులివెందులలో ఆదివారం చోటుచేసుకుంది. పులివెందుల పరిధిలోని ప్రశాంతి నగర్‌కు చెందిన యస్వంత్ సమీప కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషిస్తున్నాడని పులివెందుల అర్బన్ పోలీసులను యువతి ఆశ్రయించింది. అనంతరం అతనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది.