బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన పులివెందుల అంకాలమ్మపేట పాఠశాల హెడ్మాస్టర్ చిట్టి బాబుపై చర్యలు తీసుకోవాలని ఓబులేసు పేర్కొన్నారు. గురువారం పులివెందుల పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తక్షణమే ఇలాంటి బోగస్ ఉద్యోగులను గుర్తించి, వారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.