పులివెందులలో టీడీపీ నేతలు కబ్జాలు చేస్తున్నారని ఆర్డీవోకు ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి శనివారం విమర్శించారు. తొండూరు మండలంలో వైఎస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆయన ఆరోపించారు. వైఎస్ ఫ్యామిలీ భూకబ్జాలను నిరూపిస్తామని స్పష్టం చేశారు.