ముద్దనూరు మండల పరిధిలోని కొలవలి గ్రామంలో నల్లగుంటి గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నల్లగుంటి గంగమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. గంగమ్మకు బోనాలు పెట్టి, యాటలు సమర్పించి మొక్కుబడి తీర్చుకున్నారు.