జమ్మలమడుగు పట్టణంలో ఈ నెల 19వ తేదీ మంగళవారం జరగబోవు సీపీఎం మొదటి మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని ఆదివారం సాయంత్రం పట్టణ కార్యదర్శి జి. ఏసుదాసు స్థానిక జమ్మలమడుగు ఎన్జీవో కార్యాలయం నుంచి పిలుపునిచ్చారు. ఈ మహాసభలో పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి, వెనుకబడిన ప్రాంతాల నికర జలాలు, నిధులు, కేటాయించాలని కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.