చాగల్లు మండల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమావేశం
చాగల్లు మండల ఎపి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశం చాగల్లు అంబేద్కర్ రీడింగ్ భవనంలో సంఘం అధ్యక్షుడు కే. నాగేశ్వర రావు అధ్యక్షతన సోమవారం జరిగింది. సమావేశంలో నూతన సభ్యులను సంఘంలో చేర్చాలని, సంఘంకి స్వంత భవనం ఎర్పాటుకు స్థలం సేకరణకు కృషి చేయాలని తీర్మానం చేసారు. సంఘం లోకి నూతనంగా చేరిన విశ్రాంత ఉపాధ్యాయులు జగతా సత్యనారాయణ నాగ లక్ష్మీ దంపతులను టి. సోల్మన్ రాజు ఆధ్వర్యములో ఘనంగా సత్కరించారు.