కేంద్ర ప్రభుత్వం ప్రయోజత అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందుతున్న తీరును పరిశీలించేందుకు ఎన్ఎల్ఎం అధికార బృందం మంగళవారం ఉంగుటూరు మండలం కాగుపాడు సచివాలయాన్ని సందర్శించింది. ఐసిడిఎస్, హౌసింగ్, ఉపాధి హామీ తదితర 9 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పథకాలు, వాటి లబ్ధిదారుల వివరాలను, అందుతున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.