మాజీ భారత ప్రధాని, స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్బంగా ఆకివీడులోని చాచా నెహ్రు విగ్రహం వద్ద మాజీ ఎంపీ, మాజీ టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్నందున నెహ్రూ విగ్రహానికి పూలదండలు వేయలేకపోయినట్లు కనుమూరి బాపిరాజు విచారం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంపన సుబ్రహ్మణ్యం రాజు, అంకెం సీతారాం పాల్గొన్నారు.