ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లాలోని వరదల సమయంలో రైతులకు కలిగే పంట నష్టం గురించి ముఖ్యంగా యనమదుర్రు డ్రెయిన్ కారణంగా నియోజకవర్గంలో అనేక గ్రామాలలో వరదల కారణంగా వేల ఎకరాల పంట పొలాలు నష్టం గురించి మాట్లాడటం జరిగింది.