దోమలు వృద్ధి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వై. వి. లక్ష్మణరావు అన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం 9, 10వ వార్డులలో వెక్టార్ కంట్రోల్, హైజీన్ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దోమల వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేయాలన్నారు. నీటి తొట్టెల్లోని నీటిని ఎప్పటికప్పుడు మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.