జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలకు కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ఆర్టిసి బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పాల్గొని మాట్లాడారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.