టి. నర్సాపురం: కుటుంబాల వెలివేత కథ సుఖాంతం

76பார்த்தது
టి. నర్సాపురం మండలం తెడ్లం గ్రామంలో కుల పెద్దలు నాలుగు కుటుంబాలను బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జీలుగుమిల్లి సీఐ బి. వెంకటేశ్వరరావు, టి. నర్సాపురం ఎస్సై జయబాబు రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామంలో విచారణ చేపట్టారు. అనంతరం గ్రామంలోని ప్రజలంతా కలిసిమెలిసి సోదరభావంతో ఉండాలని, ఏమైనా సమస్యలు ఉంటే పోలీసు లేదా రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி