ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో గురువారం విదేశీ నిపుణుల బృందం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు అథారిటీ సీఈవో అతుల్ జైన్‌తో పాటు నిపుణుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. అలాగే ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సమీక్షించింది. ప్రాజెక్టు కాంట్రాక్టర్ల వద్ద పలు విషయాలని సేకరించింది. అలాగే సాంకేతిక వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.