పాలకొల్లు లోని రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి రామానాయుడు ను సోమవారం మంత్రి నిమ్మల కార్యాలయంలో, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు రాష్ట్ర, జిల్లా అభివృద్ధి, సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు ను, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ శాలువా, పూలబొకే లతో సత్కరించారు. టిడిపి జనసేన బిజెపి కూటమి నాయకులు పాల్గొన్నారు.