కార్తీక మాసం నేపథ్యంలో సముద్ర స్నానాలకు వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి మెరైన్ సీఐ బివిజి రాజు కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం సముద్ర తీర ప్రాంతంలో హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేశారు. తీరప్రాంతాల్లో సముద్రపు లోతు ఎక్కువగా ఉన్న కారణంగా స్నానాలు ఆచరించే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తీర ప్రాంతాల్లో గల గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.