పారిశ్రామిక దిగ్గజం, పద్మ విభూషణ్ రతన్ ఎన్ టాటా మరణం పట్ల ఉమ్మడి ప. గో. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలిపారు. దేశంలో కొందరి మరణం కొన్ని లక్షల కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. ఆ వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరని, విలువలతో కూడిన వ్యాపారం, బాధ్యతతో కూడిన సేవలతో దేశంలో కొన్ని తరాలకు నిలిచిపోతుందన్నారు.