రబీ సాగుకు అన్నదాతలు సన్నద్ధం కావాలని, డిసెంబర్ 15లోగా నారుమడులు వేసుకోవాలని నరసాపురం సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిల్ కుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రబీ సాగుకు వ్యవసాయ శాఖ ద్వారా రైతులను సన్నద్ధం చేసేందుకు వ్యవసాయ కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు. రబీ సాగుకు అనుకూలంగా ఉండే ఎంటీయూ 1153, 1156, 1121 శాఖ రబీ సాగుకు విత్తనాలు కావాల్సిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని సంప్రదించాలన్నారు.