విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలి: జెడ్పిటిసి

85பார்த்தது
విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలి: జెడ్పిటిసి
ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు ముందు పథంలోకి దూసుకువెళ్లాలని జెడ్ పి టి సి పొట్టి స్వర్ణలత విద్యార్థులకు సూచించారు. దేవరపల్లి మండలంలోని కృష్ణంపాలెం ప్రాథమిక ప్రైమరీ పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ "నాడు నేడు" కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం వివిధ రూపాలలో అందిస్తున్న సహాయాన్ని అసరాగా చేసుకుని విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయుడు దుర్గాప్రసాద్, ఎంపీటిసీ సత్తి జగదీశ్వర్ రెడ్డి, సత్తి సాయిశ్వర్ రెడ్డి, గుడిమెట్ల గంగాధరరెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నీరబోయిన రజిని, వైస్ చైర్మన్ కడలి అన్నవరం, కడలి హైమావతి, శ్రీను, ఉపాధ్యాయులు టి రవి, సాయి శంకర్, శుభదాసు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி