ఏలూరు: అపార్ నమోదు నిర్వహించాలి: కలెక్టర్
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్ధులకు ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజస్టరీ నమోదు యుద్ధప్రాతిపధికన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లాలోని ఎంఇఓలు, మున్సిపల్ కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపార్ ఆధార్ అనుసంధానంకు సంబంధించి మాట్లాడారు.