ఆసుపత్రుల్లో మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు ఏఆర్ డిఎస్పీ వి. జి. శ్రీహరి చెప్పారు. బుధవారం ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన భద్రతా చర్యలపై భద్రతా ఆడిట్ ను నిర్వహించారు. ఆసుపత్రులలో మహిళా డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ సహాయకులు, కార్మికుల రక్షణ పరిశీలనకై నియమించిన కమిటీ సభ్యులు నిఘా కెమెరాలను పరిశీలించారు.