ఏలూరు జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బందితో బుధవారం జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్టేషన్లలో నమోదు చేసిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా జిల్లా కేంద్రానికి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే విచారణ చేయాలని చెప్పారు. పోలీసు అధికారులు ప్రతి గ్రామాన్ని ప్రణాళికబద్ధంగా సందర్శించాలని, ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడే దానిని పరిష్కరించాలని సూచించారు.