ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్ ను ఢీల్లీలోని రైల్ భవన్ లో బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లాలో రైల్వే శాఖ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సత్తుపల్లి మీదుగా భద్రాచలం - కొవ్వూరు బ్రాడ్ గేజ్ లైన్‌కు నూతన డిపిఆర్ తయారుచేసి త్వరగా పూర్తి చేయాలని కోరారు.