ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అభయ మహిళా సేఫ్టీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 30% మహిళా పోలీసు సిబ్బంది పని చేస్తున్నారని, వీరు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో కలిసి కాలేజీలు, హాస్టల్స్, బస్టాండ్లు వంటి ప్రాంతాలలో గస్తీ నిర్వహించి ఆకతాయిలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు.