అఖిల భారత యువజన సమాఖ్య 22వ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షలు పరుచూరి రాజేంద్ర బాబు తెలిపారు. అదివారం ఏలూరు స్ఫూర్తి భవన్ నందు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకవర్గ విధానాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.