పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం భీమవరం రానున్నారు. ఉదయం 9. 30 గంటలకు
టీడీపీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. 10. 30 గంటలకు స్థానిక మల్టీప్లెక్స్ ఆవరణలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, కూటమి నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 12 గంటలకు కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించనున్నట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.