భీమవరం లెప్రసి కాలనీలో లెప్రసీ వ్యాధిగ్రస్తుల కోసం నిర్మించిన గృహాలు శిథిలావస్థలో ఉన్నందున వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల వారికి నూతన గృహాలు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని శనివారం జరిగిన శాసన మండలి సమావేశంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్ ను కోరారు. దానిపై స్పందించిన మంత్రి లెప్రసి కాలనీలో నూతన గృహాలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.