భీమవరంలో అందుబాటులోకి వచ్చిన రక్త కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం భీమవరం రాయలంలో నూతన రక్త కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భీమవరం రాయలంలో రక్త కేంద్రానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ద్వారా సమకూర్చిన నిధులు రూ.2.50 కోట్లతో అవసరమైన మిషనరీ, పరికరాలు తదితరాలను ఏర్పాటు చేశామన్నారు.