వరద బాధితులకు సహాయార్థం కోసం వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం వైసీపీ నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.