మహిళా వైద్యులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు అరికట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రతాప్ కోరారు. గురువారం తణుకులో ప్రభుత్వాసుపత్రి వైద్యులు, కళాశాల అధ్యాపకులు, నర్సింగ్ స్కూలు విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పోరాటాల ద్వారా వచ్చిన ఎన్నో హక్కులు, చట్టాలు ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్నాయని వారు అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.