భీమవరం పట్టణంలోని బీవీ రాజు విగ్రహం వద్ద ఎస్పి అజిత వేజెండ్ల శుక్రవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీల ర్యాలీలు 'ఊరేగింపులు విజయోత్సవాలకు అనుమతులు లేవన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పదని హెచ్చరించారు.