యలమంచిలి: ముగిసిన 57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు
యలమంచిలి పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో 57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు బుధవారం ముగించగా, ఈ కార్యక్రమానికి గ్రంథాలయాధికారిగా వి. ఆనంద్, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాపల్ ఆడారి పూరీ జగన్నాథ్ అధ్యక్షత వహించారు. పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులుగా డిగ్రీ ప్రిన్సిపాల్ బి. చంద్రశేఖర్, జూనియర్ ప్రిన్సిపాల్ ఎం. విజయకుమార్, ఇతర అతిథులు పాల్గొన్నారు.