అక్రమ లే ఆఫ్ ప్రకటించి 1000 మంది కార్మికులను రోడ్డుపాలు చేసిన అభిజిత్ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. కంపెనీ లే ఆఫ్ ప్రకటించినందుకు నిరసనగా అచ్యుతాపురం వద్ద కార్మికులు చేపట్టిన ఆందోళనకు సోమవారం సంఘీభావం ప్రకటించారు. వెంటనే లే ఆఫ్ ను ఎత్తివేసి కార్మికులను విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.