మాడుగుల: పంటల సంరక్షణపై సూచనలు
కృషి విజ్ఞాన కేంద్రం మరియు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం దేవరపల్లి మండలం పెదనందిపల్లి గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు కూరగాయల పంటల్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించారు. డాక్టర్ సౌజన్య వరి పొలాలు గింజ కట్టే దశలో ఉన్నందున నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వరి తర్వాత అపరాలు సాగు లాభదాయకమని, భూమిలో సేంద్రియ కార్బన్ పెరుగుతుందని చెప్పారు.