యలమంచిలి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే గదులు శుభ్రం చేయిస్తున్నారని, మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదు అంటూ ఎస్ఎఫ్ఐ యలమంచిలి డివిజన్ సెక్రటరీ మణికంఠ ఆధ్వర్యంలో గురువారం మండల విద్యాశాఖాధికారులు మీనాక్షి, అరుణ్ కుమార్లకు పిర్యాదుతో కూడిన వినతిపత్రం అందించారు. ఉన్నతాధికారులు స్కూల్ సందర్శించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.