యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ గురువారం యలమంచిలి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో తరగతి గదులు తుడిపిస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలపై స్పందించి, ఉపాధ్యాయులను మందలించారు. పిల్లలతో పనులు చేయించవద్దని సూచిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు.