ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనవాణి కార్యక్రమాన్ని జనసేన నిర్వహిస్తున్నట్లు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.