యలమంచిలి మండలం పురుషోత్తపురం, లక్కవరం, కొత్తలి తదితర గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై తామంతా పార్టీలో చేరినట్లు వారు ప్రకటించారు. జనసేన బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.