ఉచిత ఇసుక, భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డు పునరుద్ధరిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐటియుసి అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 11న అనకాపల్లి ఆర్టీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం యలమంచిలిలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.