విశాఖ నగరంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 2 నుంచి 30 వరకు మార్గశిర మాసోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ శోభారాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని ఆమె సూచించారు. ఈ మేరకు మార్గశిర మాసోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో కంటే మరింత మెరుగ్గా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.