విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త సీతంరాజు సుధాకర్ ను శనివారం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను అమలు చేయడంలో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. తనను ఈ పదవిలో నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.