రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మత్స్యకారులకు మొండిచేయి చూపించిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. గురువారం మత్స్యకార దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు మత్స్యకార నాయకులు మాజీ ఎమ్మెల్యేకు చేపను బహుకరించారు. మత్స్యకారుడి గెటప్ లో కనిపించిన వాసుపల్లి మాట్లాడుతూ వైసిపి పథకాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని అన్నారు.