సబ్బవరం పీహెచ్సీలో మంగళవారం హోమియో వైద్యాధికారి డాక్టర్ కుసుమకుమారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆయుష్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అనంతరం ఆయుష్ వైద్యం ద్వారా ఆరోగ్య పరిరక్షణ, సాధారణ వ్యాధులతో పాటు మధుమేహం నియంత్రణపై ఆశలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు పాల్గొన్నారు.