పెందుర్తి, పరవాడ మండలం
టీడీపీ నేత మలశాల భరత్ కుమార్, తల్లిదండ్రులు రమణారావు (విశాఖ డెయిరీ డైరెక్టర్), ధనమ్మ (మాజీ ఎంపీపీ) మంగళవారం వైయస్ఆర్సీపీలో చేరారు. భరత్‌కుమార్‌తో పాటు గంగుపాం నాగేశ్వరరావు (మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్), మలశాల కుమార్ రాజా (విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి) తదితరులు వైయస్ఆర్సీపీలో చేరారు. వీరికి సీఎం వైయస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.