నక్కపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణం వద్ద 29వ తేదీన ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాట్లపై టీడీపీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి. వెంకటేష్ బుధవారం సందర్శించి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా దర్బార్ కార్యక్రమానికి హోం మంత్రి అనిత రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు రాజు, బాబ్జి, సత్తిబాబు, శ్రీను, గోవిందు పాల్గొన్నారు.