అల్లూరి జిల్లాలో పింఛన్ల పంపిణీలో కొయ్యూరు మండలం4వ స్థానంలో నిలిచిందని ఎంపీడీవో ఎస్ కేవి ప్రసాద్ సోమవారము తెలిపారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో అల్లూరి జిల్లా ప్రథమ స్థానంలో సాధించిందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్,అక్టోబర్ నెలలో కూడా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీలో అల్లూరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించటంతో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారన్నారు.