నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు బకాయి వేతనాలు చెల్లించాలని మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు ఎల్వీ రమణ మాట్లాడుతూ మూడు నెలలుగా జీతాలు ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. జీతాలు అడిగిన సిబ్బందిపై కాంట్రాక్టర్ దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈనెల 16 లోపు సమస్యలు తీర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్వతి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.