నాతవరం గ్రామానికి చెందిన గంటేడ వెంకటలక్ష్మి కొన్ని రోజుల క్రితం మరణించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం కింద ఆమె భర్తకు పాములువాక గ్రామీణ వికాస్ బ్యాంకు మేనేజర్ ఓబుల నాయుడు మంగళవారం రూ. 2,00,000ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాకిరెడ్డి వెంకటరమణ, సబ్బి కుమారస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేష్, సతీష్ కుమార్, సిఏ తదితరులు పాల్గొన్నారు.